పిల్లల శారీరక మానసిక అభివృద్ధిలో తండ్రిదే ముఖ్య పాత్ర అంటున్నాయి అధ్యయనాలు.తండ్రితో స్నేహంగా ఎక్కువ సమయం గడిపే పిల్లలు సామాజిక సంబంధాలు మెరుగుపరచుకోవడం లో ముందుంటారని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు. ముఖ్యంగా తండ్రి తో సన్నిహితంగా ఉండే ఆడపిల్లలు భవిష్యత్తులో ఒక భరోసాతో ధైర్యంతో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కు దూరంగా ఉంటారని ఇంకో అధ్యయనం చెబుతోంది.కొడుకుతో తన భావాలను ఆశయాలు ఆలోచనలు పంచుకోగలితే  ఆ తండ్రే కొడుక్కి రోల్ మోడల్ అవుతాడని  అధ్యయనాలు చెబుతున్నాయి.ఆధునిక జీవితం సవాళ్ళ మయం అనుభవజ్ఞుడైన తండ్రి మార్గదర్శకత్వం తో ఎదిగే కొడుకు అనుభవాలను గ్రహించి అందరికంటే ఓ అడుగు ముందుంటాడు. అందుకే నాన్నలు కొడుకుల తో స్నేహం చేయాలి. తాము జీవితంలో గ్రహించిన సారాన్ని పిల్లలకు నూరిపోయాలి.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment