మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న మానుషీ చిల్లర్, అందమైన పొడవాటి జిలతారు గౌను వేసుకుంది. సామంత, చైతు పెళ్ళి రిసెప్షన్ లో సామంత ఎంతో అందమైన గౌను ధరించింది. అలాగే బాలీవుడ్ తారలు సోనాక్షీ సిన్హా, ఆలియాభట్, శ్రీయా చరణ్, కరిష్మా కపూర్, శ్రుతిహాసన్ వీళ్ళంతా  పీకాక్ గౌన్లతోనే మెరిసిపోతారు. ఇంత అద్భుతమైన గౌన్ల సృష్టికర్తలు పీకాక్ బ్రాండ్, ఫల్గుణీ -షాన్ లు భారతీయ ఫ్యాషన్ డిజైనింగ్ ను హాలీవుడ్ స్ధాయికి చేర్చారు. ఈ ఇద్దరు మిస్ వరల్డ్ పోటీలకు పొడవాటి గౌన్ కావాలని మానుషి అడిగితే లేత గులాబీ రంగున్న గౌను, బంగారు రంగు లాంగ్ ఫ్రాక్ తయారు చేసారు ఈ జంట. మానుషీ ఆ గౌన్ తోనే మిస్ వరల్డ్ ఫినాల్స్ లో ర్యాంప్ వాక్ చేసింది. ఐడు లక్షలు ఖర్చయింది ఆ గౌన్ కు. తాము డిజైన చేసిన గౌన్, భారత సౌందర్య చరిత్రలో భాగంగా అయ్యిందని మురిసి పోతున్నారు ఫల్గుణి శాన్ జంట!

Leave a comment