ప్రపంచలోని అందమైన రంగుల్ని సొంతం చేసుకొన్నట్లు ఉంటాయి గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన అజ్రభ్ చీరెలు. ఇప్పుడు సరికొత్త ట్రెండ్ బ్లాక్ ప్రింట్ తో తయారయ్యే ఈ అజ్రభీ చీరెలను సహాజరంగులతో తయారు చేస్తారు. ఈ చీరె తయారీకి 14నుంచి 21 రోజులు పడుతుంది. చక్కగా మెత్తగా సౌకర్యంగా ఉండే ఈ చీరెలు ఎరుపు నలుపు తెలుపు రంగులలో ఎక్కువగా ఉంటాయి. మేలు రకం నూలుతో తయారయ్యె ఈ చీరెలపైన అద్దకం వెలసి పోకుండా ఉంటుంది. ఈ అజ్రభ్ వస్త్రశ్రేణిలో చుడిదార్ లు ,శాలువాలు కూడా తయారు చేస్తారు.

Leave a comment