కాటన్ దుస్తుల్లో బగ్రు ప్రింట్ కు ప్రపంచవ్యాప్త ఆదరణ ఉంది రాజస్థాన్ లోని బగ్రు ప్రాంతానికి చెందిన ఈ ప్రింట్లు బ్లకులతో డిజైన్లు చేసి ముద్రిస్తారు. ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కాటన్ వస్త్రాల పైనే ముద్రిస్తారు. మొక్కలు, మట్టి సేంద్రియ పదార్థాల నుంచి సేకరించిన రంగులతో భిన్నమైన ప్రింట్లు తో ఈ బగ్రు కుర్తీలు చాలా అందంగా ఉంటాయి. ఎక్కువగా ముదురు రంగులే ఉపయోగించే ఈ బగ్రు దుస్తులు టెరికోట ఆర్ట్ డైజెడ్ జ్యువెలరీ లతో కలిపి వేసుకుంటే చక్కగా నప్పుతాయి. బగ్రు ప్రింట్లు చుట్టూ కొట్టొచ్చినట్టు కనిపించే నల్లని గీతతో ఉంటాయి.

Leave a comment