Categories

ప్రపంచ సుందరి పోటీలు ప్రతి సంవత్సరం కోట్ల మంది టీవీ ల్లో చూస్తూ ఉంటారు అందాల రాణికి అలంకరించే కిరీటం జపాన్ కు చెందిన మికి మోటో అనే సంస్థ 2017 లో డిజైన్ చేసింది. దాన్ని రెండు మిలియన్ల అమెరికన్ డాలర్ లకు భీమా చేశారు. నీలి రంగు గ్లొబ్,దాని చుట్టూ వైట్ గోల్డ్ లో మెరిసిపోయే ఆరు తెల్లని బ్రాంచెస్,వజ్రాలు ముత్యాలు,నీలాలు స్పటికం వంటి జాతి రత్నాలు కలిపి ఈ కిరీటం తయారు చేశారు.ఇందులోని ఆరు శాఖలు ఆరు ఖండాల ను సూచిస్తాయి.నీలం తెలుపు రంగులు దేశాల మధ్య సమగ్రతను స్పష్టంగా చూపిస్తాయి.ఈ కిరీటాన్ని బ్లూ క్రౌన్ అంటారు.