వర్షపు వేళలో ఆకాశంలో హరివిల్లు విరుస్తుంది. అలాటి సప్తవర్ణాల ఇంద్రధనస్సు నదిలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ నీరు కాస్తా పంచవన్నెల మిశ్రమం లాగా మెరిస్తే ?అదిగో కొలంబియాలోని సెరేనియం డి  లా మెకెరేనా పర్వతశ్రేణిలో కేనొ క్రిష్టల్ అనే నది ఒకటుంది. ప్రపంచంలోని అందమైన నదుల్లో ఇది ఒకటి. ప్రకృతి  గీసిన పెయింటింగ్ అందం ఈ నది ఎరుపు, పసుపు,నీలం,ఆకుపచ్చ,నలుపు రంగుల కల పోతతో కనువిందు చేస్తుంది. ఈ నది అడుగు భాగం వేళ సంవత్సరాల క్రితం క్వార్జ్ అనే రాయితో ఏర్పడింది. దాని పైన జులై నుంచి నవంబర్ ల మధ్య కాలంలో మెకెరేనియం అనే నాచు పెరుగుతుంది. దాని వల్లనే ఈ నది సప్త వర్ణాలు ఏర్పడ్డాయి. అందుకే ఈ నదిని లిఖ్విడ్ రెయిన్ బో అని పిలుస్తారు.

Leave a comment