ఎవరిపై వారికి నమ్మకం ఉండాలి. ఎంతమంది నీ అభిప్రాయాన్ని మార్చాలని చుసినా మనసు చెప్పిందే విను నీకలాల్ని నువు నెరవేర్చుకో అంటుంది శివాని. హీరో రాజశేఖర్‌,జీవిత ల పెద్ద కూతురు. శివాని సినిమాల్లో నటించి,ఇప్పుడు మోడలింగ్ పైన దృష్టి పెట్టింది. ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతోంది ఫెమీనా ఇండియా అందాల పోటీల్లో తమిళనాడు తరఫున ఎంపికైంది. జులై లో జరగనున్న అందాల పోటీలకు దరఖాస్తులో వివిధ రాష్ట్రాలను ఎంచుకొనే అవకాశం ఉంటే శివాని ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు,తెలంగాణ లను ఎంచుకొంది. నిర్వాహకులు తమిళనాడు నుంచి అవకాశం ఇచ్చారు శివునికి మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రవేశం ఉంది.

Leave a comment