ఒక నవ్వు నవ్వితే మొహంలోని ఒక తెలియని వెలుగొస్తుందిట. ఎలాంటి విపత్కరమైన అనుభవాన్నయినా ఎదుర్కునే శక్తి నిచ్చే  ఔషధం నవ్వు  శక్తిమంతమైన ఆయుధం నవ్వు. 60 శాతం రోగాలు అతి సులభంగా తగ్గించే టానిక్ కూడా నవ్వే. ఎందుకో ఈ సహజమైన టానిక్ కు సక్రమంగా ఉపయోగించుకోవటం లేదని పరిశోధనలు చెపుతున్నాయి. మనసారా నవ్వే నవ్వు ప్రభావం మొత్తం 16 శరీర అందాల పైన ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుందట. ముఖ కండరాలతో మొదలుకుని ఊపిరితిత్తులు , గుండె ప్రసరణ ఇతర శరీర భాగాలు కండరాలు నవ్వుతో మేలు పొందుతాయి. కాసేపు నవ్వితే శరీరంలో 50 క్యాలరీల శక్తి వినియోగం అవుతుంది. హ్యూమర్ థెరపీ పేరుతో  ఆస్పత్రిలో కోలుకునే వారిని సంతోషంలో ఉండేలా చేసి నవ్వించి వాళ్ళని త్వరగా కోలుకునేలా చేస్తున్నారు. ఒంటారిగా ఉన్నప్పుడైనా సరే కామెడీ కధలు చదివి జోక్స్ చదివి మనసుని ఉల్లాసంగా చేసి పెదవుల పైకి నవ్వు తెప్పించమంటున్నారు డాక్టర్లు. నవ్వును కూడా సాధన చేసి నేర్చుకోమంటున్నారు వాళ్ళు. జీవితంలో నిజమైన సంతోషం నవ్వు కావాలంటే దాన్ని సాధించేందుకు కృషిచేయాలి. జీవితాన్ని గెలవాలి. విజేత మొహం ఎప్పుడూ నవ్వుతూనే నిండి ఉంటుంది. నవ్వు విలాసవంతమైన అనుభవం లాగా ఎప్పుడో ఖరీదుగా వచ్చి రాలేది కాదు. అత్యంత అవసరమైన చర్య. నిత్య జీవితం ఎప్పుడూ  నవ్వుల సందడి తో నిండివుండాలి.

Leave a comment