Categories
అందంగా కనిపించడం తో పాటు ఆరోగ్య సంరక్షణ చేసే ఆభరణాలు వస్తున్నాయి. అందాన్ని రెట్టింపు చేసే లా కనిపించే హారం బెల్లా బీట్ లీఫ్. ఇది చూసేందుకు నగల గా ఉంటుంది కానీ ఇది ఫిట్ నెస్ ని కాపాడే యాప్ తో పని చేసే పరికరం. హారంగా బ్రాస్ లేట్ గా బ్రూచ్ గా వివిధ రూపాల్లో కనిపిస్తుంది. కానీ ఈ పరికరం 24 గంటలు పనిచేస్తుంది. రోజంతా ఖర్చుచేసే కేలరీలు లెక్కిస్తుంది. నెలసరి సమయాన్ని నమోదు చేస్తుంది. నిద్రలేమి ఒత్తిడి గురించి ఆరా తీస్తుంది. ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు యాప్ ద్వారా విశ్లేషించి ధ్యానం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఫ్యాషన్ ఆరోగ్యం కలిపితే ఈ హారం తయారయింది.