చిన్న చిన్న ఆలోచనలతో ఇంటికి చక్కని అందం తీసుకు రావచ్చు. ఇంట్లో మనీ ప్లాంట్స్ పెంచాలనుకొంటే ఒక నీళ్ళ సీసాలో రంగురంగుల జెల్ బాల్స్ వేసి నీళ్ళు పోస్తే అవి సీసా నిండుగా వచ్చేలా ఉబ్బుతాయి. ఈ గాజు సీసాలో ఒక మనీ ప్లాంట్ వేస్తే చాలా చక్కగా తీగలా వస్తుంది. ఈ జెల్ బాల్స్ నింపిన సీసాలను కానుకగా ఇచ్చేందుకు బావుంటాయి. సగం వరకు ఈ బాల్స్ నింపి పైన కొవ్వొత్తి వెలిగిస్తే సీసా సగం రంగుల బాల్స్, మిగితా సగం కొవ్వత్తి వెలుగుతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పిల్లలు పుట్టిన రోజులు చిన్న ఫంక్షన్ తో ఇల్లు అలంకరించేదుకు బావుంటాయి.

Leave a comment