అప్పటి వరకు ,కాలేజీ ,యూనివర్సిటీల్లో ప్రతి ఫ్యాషన్ ని గుండెలకు హాత్తుకున్న అమ్మాయిలు ఉద్యోగం రాగానే ఆఫీస్ వాతావరణానికి తగ్గట్లు ఉద్యోగ స్వభావానికి తగ్గట్లు కాస్త డిగ్నిఫైడ్ గా ,హుందాగా తయారవ్వాలని ,కాలేజీ గోయింగ్ లాగా ఉంటే బావుండదు అనుకొంటారు. అలాంటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు నలగకుండా ఉండాలి అంటే షిఫాన్ జార్జెట్ వంటి రకాలు ధరించవచ్చు లేదా చక్కని హేండ్ లూమ్ వస్త్రశ్రేణిలో మంగళగిరి ఇకత్ ,లినెస్ ,భాదా వెరైటీలు ఇంచక్కని జియో మెట్రింగ్ ప్రింట్లూ ,బ్లాక్ ప్రింట్లు ఎంచుకోవచ్చు. అందమైన కాటన్ చీరెలకు ,కాటన్ లో చక్కని ప్రింట్స్ ఉన్నా బ్లౌజులు మెడకి దగ్గరగా ఉండేట్టు మోచేతుల దగ్గర దాకా వచ్చేట్లు వెరైటీ బ్లౌజ్ లు వేసుకొంటే చక్కగా ఉంటాయి.

Leave a comment