ఒక్కో ప్రాంతంలో ఒక్కో అందం కనిపిస్తుంది . వేష భాషల్లో తేడ కానీ అందరూ అందంగా కనిపించేందుకు వారివారి పద్ధతులు ఫాలో అవుతారు . కెన్యా తెగల గిరిజనుల ఫోటోలు చూస్తుంటే చెవులకు పెద్ద రంద్రాలు ,రాళ్ళు కొమ్ముల నగలు  జుట్టు కత్తిరించు కొంటారు . మెడచుట్టు గుండెల వరకు అల్లిన ఆభరణం లాటివి పెట్టు కొంటారు . జపాన్ అమ్మాయిల పన్ను పైన పన్ను ఉంటే అందం అనుకొంటారట . అలాగే మయన్మార్ మహిళల రింగుల వరస తగిలించిన పొడవాటి మీద అందం అనుకొంటారు . అందానికీ సంపదకు ఇదే గుర్తు . సంప్రదాయ దుస్తులు నగలు ధరించిన ఏ ప్రాంతపు వాళ్ళను చూసినా అందం కోసం ప్రతివాళ్ళు ఒక ప్రత్యేక పద్ధతి అనుసరించారని తేలిపోతుంది .

Leave a comment