హైహీల్స్ ఇష్టంలేని అమ్మాయిలు ఉన్నారా? ఇందులో బోలెడన్ని ఫ్యాషన్ వెరైటీలు కిచెన్, పెన్సిల్, పంప్స్, వెడ్జేస్, కొన్…… ఇలా దుస్తుల్ని బట్టి ఒక్కటి ఎంచుకొంటారు. కానీ ఈ హీల్స్ వాడుతున్నప్పుడు కాలి బొటన వేలి పైన బరువు పడుతుంది. ఎత్తు మడమల చెప్పుల తో పాదం లోని నరాలు శ్రమకు గురవ్వుతాయి. పిక్కలు కండరాళ్ళ పైన ఒత్తిడి పడుతుంది. దీర్ఘ కాలం పాటు ఇవి వాడితే పిక్కల పైన కండరాళ్ళు కుచించుకు పోతాయి. పాదాల అడుగున వంపు తగ్గి పదాలు చడురుగా అయ్యిపోతాయి. దీని వల్ల ప్లాంటర్ ఫాసియైటిస్ అనే మడమ నొప్పి బాధ పెడుతుంది. ఒక్క సారి ఈ ఎత్తైన హీల్స్ తో స్లిప్ అయి పాదం మడత బడ్డ లేదా విరిగిన ఇక శాశ్వత ఇబ్బందే, కనుక ఎంత ఫ్యాషన్ అయినా ఈ హీల్స్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి.

Leave a comment