ప్రముఖ ఇండియన్ డిజైనర్ లకు ఫ్యాషనిష్ఠాలకు ఇంకా మరెందరికో సోనమ్ కపూర్ ఇప్పుడు స్టయిల్ ఐకాన్. కార్డియో స్విమ్మింగ్ పవర్ యోగా కథక్ లతో ఇవాళ్టి రూపాన్ని సాధించారామె. ఇలాంటి నాజూకు తనం కోసం ఎంతో కఠోర శ్రమ చేసింది సోనమ్. దశాబ్దం క్రితం సింగపూర్ లో ఆమె చదువుకునేటప్పుడు ఆమె బరువు 87 కిలోలు. ఎలాంటి ఆహార నియమాలు లేవు. సంజయ్ లీలా భన్సాలీ లో సావరియా సినిమాతో ఆమె ఫిట్ నెస్ పైన దృష్టి పెట్టింది. ఆ ఛాలెంజ్ నిఅలవోకగా జయించి 32 కేజీల బరువు తగ్గిందామె. ఈ బరువు తగ్గే పనిలో సోనమ్ అనేక మంది ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఒక విభాగంలో ఒక ట్రైనర్. ఆమె మంచి కథక్ డాన్సర్. పుడుతూనే ఎవ్వరికీ మంచి సౌందర్యం ఆకృతి ఉండదు. ఎదిగే కొద్దీ శరీరాన్ని చక్కగా మలుచుకోవాలి. ఇప్పటి తారలు వాళ్ళు రెడ్ కార్పెట్స్ పైన నడవటం కోసం వెండి తెరపై మెరవటం కోసం ఎనెన్ని కష్టాలు పడ్డారు? ఎంత నోరు కట్టేసుకున్నారు?

Leave a comment