బంగారం చాలా విలువైంది . కానీ అంతకంటే మెరుగైంది ప్లాటినం. 1798 లో స్పానిష్ లో దీన్ని వెండి వంటి కొత్త లోహం గా గుర్తించారు. దీన్ని కరిగించటం చాలా కష్టం. ఒకప్పుడు వజ్రా భరణాలకు మాత్రమే ఉపయోగించేవారు. ఎన్నేళ్ళు గడిచిన వన్నె తరగని,విలువ తగ్గని లోహం ఇది. మన దేశం లో నగల తయారీలో వాడే ప్లాటినం 95 శాతం స్వచ్ఛమైంది. నగల ఫినిషింగ్ కోసం ఐదు శాతం ఇడియం కోబాల్ట్ మిక్స్ చేస్తారు. బంగారం వెండి లాగా మెరుగే అవసరం లేదు. పురుషులకు ఉంగరాలు బ్రాస్ లైట్స్,చెయిన్స్,మహిళలకు చెయిన్ లు నెక్లెస్ లు,చెవి ఆభరణాలు గాజులు వంటివి తయారు చేస్తారు. బంగారం నగల లగే హాల్ మార్క్ ముద్ర వుంటుంది పి టి 950 ముద్ర వేస్తే అందులో మారే లోహం కలవలేదనే నాణ్యత కు సూచన ప్లాటినం నగల్లో వజ్రాలు పొదిగితే అవి మరింత విలువైనవి.

Leave a comment