రంగులమయంగా  వుండే ప్రపంచంలో ఉంటున్నాం మనం. చుట్టూ వర్ణ శోభ, అలంకరించే ప్రకృతి అయినా ఇంకో కొత్త వర్ణం పుట్టుకొస్తూనే వుంది. ఇప్పుడు వచ్చిన షెడ్ మిలెన్యల్ పింక్. గులాబీ వర్ణంలో ఇంకో కొత్త ప్రశాంతమైన రంగు. ఈ రంగుకి ఇప్పుడు ఎంత డిమాండ్ వుందంటే ఇంటీరియార్ డిజైన్ ల దగ్గర నుంచి సోఫాసెట్  కవర్ల వరకు ఇదే చక్కని రంగు. ఇక ఈ మిలెన్నియల్ పింక్ ఫుడ్ ఫ్యాషన్ లో కుడా భాగం అయిపోయింది. బిస్కెట్లు, న్యుడిల్స్, చాక్లెట్స్ వస్తున్నాయి. ఒక్క జనరేషన్ కు ఒక్క పెరుంటుంది. 1980 ల నుంచి 1990 ల వరకు పుట్టిన వారు మిలేనియల్స్. ఈ తరానికి నచ్చిన రంగు కాబట్టి దీని పేరు మిలెన్నియల్ పింక్ అన్నారు సామాజిక శాస్త్రవేత్తలు.

Leave a comment