సంక్రాంతి వరకు బంతిపూల రోజులు ఇవి చూసేందుకే కాదు అందానికి ఎంతో అందం ఇస్తాయి. బంతిపూల రెక్కల్ని నీటిలో మరిగించి ఆ నీళ్లలో తేనె కలిపి ఆ నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేస్తే అది సహజ టోనర్ గా పని చేస్తుంది. ఈ నీళ్లకు కాసిని  గులాబీ నీరు, నిమ్మరసం చేర్చి ముఖం కడుగుతూ ఉంటే చర్మంపై టాన్ పోతుంది. బంతి పువ్వులో ఉండే గైకో ప్రోటీన్ న్యూ క్లియో ప్రోటీన్ అనే పదార్థాలు చర్మ కణాలు పునరుత్పత్తికి సాయం చేస్తాయి. మొటిమలను తగ్గిస్తాయి బొప్పాయి గుజ్జు బంతిపూల గుజ్జుతో చక్కని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు.

Leave a comment