Categories
అధ్భుతమైన వెండి జరీ బెనారస్ చీరెలు గంగానదీ తీరంలోని వేలాది కార్మికులు సృష్టి. గోరాఖ్ పూర్ చందేలి, భందేలి ,జానాపూర్ వంటివన్నీ బెనారస్ పట్టు చీరెలు నేసే మగ్గాలతో నిండి ఉండేవి. ఒకప్పుడు ఎన్నో రకాల బెనారస్ పట్టు చీరెలు తయారయ్యేవి కానీ ఇప్పుడు నాలుగు రకాల చీరెలే మిగిలాయి. జమ్ దాని జంగ్ల టాంబోయి టిష్యూ రకాలున్నాయి. జమ్ దానీలో పట్టు ఇతర చేనేతలు కలుస్తాయి. జంగ్లా చీరెల్లో రంగు రంగుల పట్టు పోగులు వాడతారు.టాంబోయి చీరెల్లో అంచుగా ఉండే పోగులు దట్టంగా ఉంటాయి. టెష్కు చీరెల్లో జరీ బంగారు రంగులో ఉంటుంది. ఎంతో అందమైన బెనారస్ చీరె లేకుండా ఒక వేడుకకు అందమే లేదు .