కర్ణాటక లో ఇల్కాల్ ఎక్కడఅంటే చెప్పలేరేమో కానీ  ఇల్కాల్ చీరలంటే మాత్రం చాలా పాప్యులర్. ఇల్కాల్ గ్రామం మొత్తం ఈ నేత వేయటంలో నిమగ్నమై వుంటారు. పేల్ స్టైపెడ్ పల్లు అంచుల దాకా సాగే బోర్డర్ తో కలిసిపోవడం  ఇల్కాల్ చీరల స్పెషాలిటీ. ఇవి చాలా భాగం మగ్గాల పైనే నేస్తారు. సాధారణంగా చీర పమిటి కొంగు విడిగా తయారు చేసి జాయింటుచేస్తారు. ఐదు వేల  పోగులతో చేత్తో ముడులు వేస్తూ  కూల్ బ్రైట్ కలర్స్ తో నేశాక చీరలు కొత్త రంగు చేత్తో అద్ది ట్విస్ట్ చేస్తారు. నిండు నూలు దారాలతో రంగుల సిల్క్ లేదా రేయాన్ అంటే ఆర్ట్ సిల్క్ పోగుల్ని ఓ రోజులో అల్లిక పూర్తి  చేస్తారు. కసూటి ఎంబ్రాయిడరీ అదనపు హంగుగా ఉంటుంది. శంఖు పూలు ,కలువ పూలు రధాలు ఏనుగులు దీపాలు వంటి డిజైన్స్ వేస్తారు. చీర చాలా అందంగా ఉంటుంది.

Leave a comment