ఇవి చామంతులు,బంతులు పూసే కాలం . ఈ చక్కని పువ్వులు ఆరోగ్యానికీ ఎంతో మేలుచేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ముఖ్యంగా చామంతి తో చేసిన టీ ని మొహానికి రాసుకొని బాగా ఆరిపోనివ్వాలి . చర్మంపై పేరుకున్న నలుపు పోగొట్టే బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది . చర్మం ఛాయను మెరుగుపరుస్తుంది . నిద్ర లేమి పని ఒత్తిడి తో కళ్ళువాచి కళ్ళకింద ముడతలు ,మరకలు కనిపిస్తే ఈ చామంతి టీ లో దూదిని ముంచి కాళ్ళపైన ఉంచుకొంటే అలసట మాయం అవుతుంది చామంతి టీ లో గోరింటాకు పొడి కలిపి రాత్రివేళ నాననిచ్చి ఉదయం తలకు పట్టించి ఓ గంట ఆగి తలస్నానం చేస్తే జుట్టుకు పోషణ అంది పట్టుల మారుతుంది .

Leave a comment