జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకో ఇమేజ్ సృష్టించుకున్న నటి ప్రియాంకా చోప్రా. హాలీవుడ్ లో తనదైన ఓ స్టయిల్  లో సాగుతోంది. హెయిర్ స్టయిల్ వస్త్రాలంకరణ మార్చేస్తూ రూపంలో రోజుకో ప్రత్యేకత చూపిస్తోందామె. చక్కని చర్మం విల్లులా వంగిన కనుబొమ్మలు చక్కని కనురెప్పలు ఆమె ప్రత్యేకత. ఈ మధ్య కాలంలోని కొన్ని డ్రెస్ లు ఆమె ఎంతో ప్రత్యేకంగా కనిపించింది. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్లు ఫిష్ టెయిల్  జడను  స్టయిల్ గా అల్లేసి భుజాలపైకి వదిలేస్తే ఇంకో రోజు ఎల్లో కలర్ స్ట్రాప్ లేస్  జార్జెట్ గౌన్ ను పోనీతో ఎర్రని పెదాలతో అన్ మ్యాచ్డ్ అయినా డోంట్ కేర్ అన్నట్లు చూస్తోంది. డీప్ చాక్లేట్  బ్రౌన్ లిప్స్ మెటాలిక్ గ్లాస్ మెరుపులా జుట్టుతో అదే కలర్ డ్రెస్ తో స్టన్నింగ్ గా కనిపిస్తోంది. వస్త్రధారణకు అనువుగా హెయిర్ స్టయిల్  మేకప్ ఎలా చేసుకోవాలో మెళుకువలు తెలిస్తే ఎవరైనా అందాల కొండల్లాగే వుంటారు. ప్రియాంక ఫ్యాషన్ ఐకాన్. ఎవరైనా ఆమె సీక్రెట్ ను తెలుసుకోవచ్చు. అంటే తాము ఎలా వుంటారో గుర్తించ గలిగితే తమకేది మ్యాచ్ అవుతుందో తెలుసుకోగలుగుతారు.

Leave a comment