మంచి పోషకాలతోనే శరీరారోగ్యం . కానీ కొన్ని పోషకాలు తినేందుకు శరీర లావణ్యం పెంచుకునే పూతలగానూ  ఉపయోగపడతాయి. దాన్ని అటు ఆహారంలో తీసుకోవాలి చర్మానికీ  రాసుకోవాలి. చర్మం కాంతిగా తేజస్సు తో కనిపించాలంటే విటమిన్ ఇ  అండ్ పదార్ధాలు రోజు తినాలి. అప్పుడు అందులోని పోషకాలు శరీరానికి అంది చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ విటమిన్ ఇ  మాత్రల రూపంలో దొరుకుతుంది. రోజు ఉదయాన్నే ఇ  విటమిన్ నూనెను ఒంటికి పట్టించి మర్దనా చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేసినా చర్మం చక్కగా మృదువుగా కాంతిగా అయిపోతుంది. మొహం పైన పట్టేస్తే కళ్ళ కింద నలుపు మడతలు తగ్గుతాయి. మొటిమల తాలూకు మచ్చలు సన్నటి గీతలు కూడా ఈ విటమిన్ ఇ  నూనె రాస్తూ ఉంటే క్రమంగా తగ్గిపోతాయి . రాత్రివేళ రోజు ఈ నూనె అప్లయ్  చేస్తే ఉదయం చల్లని నీళ్లతో కడిగేస్తే ముఖంలో మురికి పోయేందుకు కూడా ఈ నుయ్న్ చక్కగా పనిచేస్తుంది. విటమిన్ ఇ  ఉన్న ఆహారం  తీసుకోవటం వల్ల  చర్మం సాగే గుణం పెరిగి ఆరోగ్యంగా అయిపోతుంది.

Leave a comment