Categories
శనగపిండి మంచి స్క్రబ్బర్. మృత కణాలు తొలగించేందుకు ఎంతో బాగా పనికివస్తుంది. శనగపిండి లో నిమ్మరసం కలిపి చిక్కని పేస్ట్ లాగా చేసి మొహంపై రాసి ఆరిపోయాక నలుస్తు మఖం పై రబ్ చేస్తూ వుంటే ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు రాలిపోతాయి. మోచేతులు మెడ నల్లగా అనిపిస్తే శనగపిండి పసుపు కలిపి మాస్క్ లా వేస్తే నెమ్మదిగా నలుపు తగ్గిపోతుంది. ముఖం శుభ్రంగా ఉండాలంటే శనగపిండి కీరా రసం ప్యాక్ వేసుకోవాలి. ఆయిల్ చర్మం అయితే పెరుగు గులాబీ నీళ్ళు శనగపిండి కలిపి రాస్తే జిడ్డుపోయి మొహం ఫ్రెష్ గా ఉంటుంది. శనగపిండి లో పచ్చి పాలు,లేదా పెరుగు కలిపి ప్రతిరోజు ప్యాక్ వేసుకొని పావుగంటలో కడిగేస్తే బాగా మొహం నునుపుగా మెరుస్తూ ఉంటుంది.