బటర్ ఫ్లై పీ ఫ్లవర్ గా పిలిచే శంభుపూలు సంప్రదాయ వైద్యంలో చాలా ముఖ్యమైనవి. తెలుపు ,నీలం ,ఊదారంగల్లో పూసే ఈ పూలు అద్భుత ఔషధాలు. శంభు పూల ఆకులు వేళ్ళతో చేసిన పొడి జ్ఞాపక శక్తి , తెలివి తేటలు పెంచుతుందనీ, నిద్రలేమికీ డిప్రేషన్ కు మందులా పని చేస్తుందని వైద్యులు చెపుతారు. ఈ పూవుని తినవచ్చు లేదా గ్రీన్ టీలాగా నీళ్ళలా మరిగించి తాగవచ్చు. ఈ పువ్వులోని క్యుయెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్ జుట్టు తెల్లడబకుండా చూస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెంచి చర్మం సాగుదలను పెంచి మడతలు రానివ్వదు. అందమైన ఈ పువ్వు రంగుతో ఐస్ క్రీమ్ లు స్వీట్లు ,కేక్ లు తయారు చేస్తున్నారు. ఈ పువ్వు అందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది.

Leave a comment