ఎసెన్షియల్ ఆయిల్స్ చర్మానికి అందాన్ని తీసుకురావటం లో ముందుంటాయి. ఇందులో లో నిమ్మ నూనె తాజా తనానికి పరిశుభ్రతకు మారుపేరు. ఇల్లు శుభ్రపరిచే సాధనాలు సబ్బుల తయారీలో ఈ నూనె విరివిగా వాడుతారు. ఈ నూనెలో ఉండే డి-లిమోనిని అనే మూలకం చర్మం పైన ముడతలు పోగొట్టి రక్త ప్రసరణ మెరుగు పరచి చర్మాన్ని తేటగా చేస్తుంది. సూర్యరశ్మి ప్రభావంతో కమిలిపోయిన చర్మాన్ని తిరిగి కాంతిమంతంగా చేయటంలో లావెండర్ నూనె తిరుగులేనిది. వంకాయ రంగు పువ్వులుండే ఒక రకం తులసి మొక్క లాంటి క్లేరీసేజ్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది.చర్మ పై పొరకు రక్తప్రసరణను పెంచే సామర్ధ్యం ఇందులో పుష్కలంగా ఉంది.

Leave a comment