బసవ రామతారకం గారు చాలా ప్రైవేట్ వ్యక్తి.ప్రజలు దేవుడిగా కొలిచే మహానటుడి భార్య అయినా ఆమె ఆయన నీడలో, తనదైన వ్యక్తిత్వంలో మెలిగిన మహిళ ప్రజలకు ఆమె తెలుసు.  వాళ్ళు ఆమెను చూడలేదు. ఆమె పాత్రలో నటించటం కోసం ఆమె గురించి తెలుసుకుంటే చాలా ఆసక్తిగా అనిపించింది అంటుంది విద్యాబాలన్. ఎన్టీ రామారావు జీవిత కథతో రూపోందుతున్న చిత్రం ఎన్టీఆర్ సినిమాను నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బసవరామతారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తుంది. ఈ సినిమా గురించి ఒక ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో బసవరామతారకం ఎన్టీఆర్ జీవితంలో ఒక భాగం ఒక సొంత వ్యక్తిత్వంతో ప్రకాశించే ఆమె పాత్ర అంగీకరించినందుకు కారణం కేవలం ఆమె గురించి సంపూర్ణంగా తెలుసుకోవటమే అన్నది విద్యాబాలన్.

Leave a comment