ప్రపంచ వ్యాప్తంగా  పేరు పొందిన మెక్సికన్ మెడిటేరియన్ థాయ్ వంటకాల్లో కూడా మన వంటింట్లో వుండే కారం పసుపు ఆవాలతో  పాటు ధనియాలు కారం వెల్లుల్లి జీలకర్ర వాడతారు . మెక్సికన్ వంటకాల్లో మనం కరివేపాకు వేసినట్లు బరిగానోని ప్రయోగిస్తారు. ఇవి చూసేందుకు మరువం ఆకుల్లా ఉంటాయి. మెడిటేరియన్ వంటకాల్లో బరిగానో తో పాటు థైమ్ మనం వాడే బిర్యానీ ఆకులు తులసి ఆకులు ఎక్కువగా వాడతారు. వీటితో పాటు యాలకులు దాల్చిన చెక్క అల్లం ధనియాలు ఎక్కువగా వాడతారు. ఫ్రాన్స్ లో అయితే మాత్రం బిర్యానీ లో వాడే చిన్న చిన్న జాజికాయల్ని ఎక్కువగా వాడతారు. వీటితో పాటు థైమ్ రోజ్ మేరీ ఒరేగానో ఆకుల్ని ఎక్కువగా వాడతారు. థాయ్ వంటకాల్లో తులసి పసుపు యలకుల్ని అరేబియన్ వంటకాల్లో ఆల్ స్పైస్ లేదా జమైకా మిరియాలు వాడతారు. అల్లం లవంగాలు దాల్చిన చెక్క వాళ్ళ వంటకాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

Leave a comment