ఒక ప్రత్యేకమైన అపురూపమైన అంశాన్ని సృష్టించేందుకు ఎంతో క్రియేటివిటీ కావాలి. ఆ ప్రత్యేకమైన వస్తువు చుట్టూ వాతావరణంలో ప్రేత్యేకంగా కనిపిస్తూ, విలక్షణంగా అనిపిస్తూ ఆకట్టుకోవాలి. ఇంతా చేసుకునేందుకు ఒక స్పెషలిస్టుకు ఒక డిజైనర్ కు ఎంతో శక్తి కావాలి. యువ ఫ్యాశాన్ డిజైనర్స్ నీకిక, గౌరీ రూపొందించిన పింక్ అండ్ వైట్ ఫెదర్ గౌన్ డిల్లీలో జరిగిన స్ప్రింగ్ సమ్మర్ 2018 కలక్షన్ కే ప్రేత్యేక ఎట్రాక్షన్ గా నిలబడింది. ఆ గౌన్ లో దీపికా పాడుకొనే రాంప్ పైన అడుగులు వేస్తుంటే ఒక అందమైన పక్షి తన సౌందర్య విలాసం చూపిస్తున్నట్లు వుంది. దీపికా కధల్లో రాజకుమారీ లాగా ఈ అందమైన గౌన్ లో వెయ్యింతల అందం తో మెరిసింది.

Leave a comment