వివాహితురాలైన భారతీయ యువతి తప్పనిసరిగా దరించే ఆభరణాలలో మాంగల్యం ,నల్లపూసలు,మెట్టెలు ఉంటాయి . వైదిక పురాణ కాలాల్లోనూ వివాహిత కాలి వేలికి ఆభరణం ధరించే సంప్రదాయం ఉంది . వీటినే మెట్టెలు (టోరింగ్స్ ) అంటున్నారు . వివాహ కార్యక్రమంలో కాలివేలికి మెత్తికి తొడగటం సంప్రదాయం. ఆకూ,పువ్వు,చేప ,వంటి ఆకృతుల్లో రింగ్ పైన చిన్ని అలంకరణ ఉంటుంది . సాధారణంగా వీటి ని వెండి తోనే చేస్తారు . ఈ ఆభరణాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు . ఒరిస్సాలో “ముడా “అని బీహార్లో పాన్ చుట్కి అని ఉత్తర ప్రదేశ్ లో చిచియా అని ,మద్యప్రదేశ్ లో దాదాపు పదమూడు రకాల కాలివేళ్ళ రంగులతో అంగుతి ,ఎల్రియ,అనాయిల్ ,చిటియా,బేలా వంటి పేర్లతో పిలుస్తారు . వీటితో పాటు నాలుగో వెలికి తొడిగేవి పిల్లేళ్ళు అంటారు . ఇవి మెట్టెల సైజ్ కంటే చిన్నవి . ఈ రెండు కలసి మెట్టెలు ,పిల్లేళ్ళుగా వివాహ సమయంలో వధువుకు మేనమామ వరసయ్యే వాళ్ళు బహుకరిస్తారు.

Leave a comment