అతి సర్వత్ర వర్జాయేత్ అన్నది పెద్దలు చెప్పేది. దేనికైనా అతి పనికిరాదు. ఆరోగ్యం భయం ప్రమాదకరం అంటున్నారు  నార్వే పరిశోధకులు.ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించేవాళ్ళు అతి శ్రద్ధ తీసుకునేవాళ్ళు అనవసర భయంతో గుండె జబ్బులకు లోనవుతారంటున్నారు. ఒక అధ్యయనంలో పది వేల మంది ఆహారపు అలవాట్లు ఆరోగ్య స్థితి ఆరోగ్యం పట్ల వాళ్ళ ఆలోచనా విధానం ఇవన్నీ నమోదు చేసారు. ఏడేళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించాక  వాళ్ళ ఆరోగ్య స్థితి గమనిస్తే ఆరోగ్య భయం వున్నవాళ్లు 70 శాతం మంది గుండ ఏజబ్బుకు గురైనట్లు గుర్తించారు. అనవసరమైన ఆందోళన వత్తిడే కారణంగా రక్తపోటు పెరుగుతుందని అదే గుండె జబ్బుకు దారితీస్తుందని అధ్యయన కారులు హెచ్చరిస్తున్నారు.

Leave a comment