శానిటైజర్ తయారీతో ఫోర్ట్స్ జాబితాలోకి ఎక్కింది .స్పెయిన్ కు చెందిన ఆండ్రియా లిస్బోనా బార్చిలోన లో పుట్టి పెరిగి ఆండ్రియా ఎం.బి.ఏ పూర్తయ్యాక వ్యక్తిగత శుభ్రంతతో ముడి పడిన వ్యాపారంలోకి రావాలని నిర్ణయించు కొని శానిటైజర్ తయారీలోకి వచ్చింది .యాపిల్ ఫోన్ డిజైన్ లాగా ఉండే పవర్ మిస్టయి తయారు చేయించింది .టచ్ లాండ్ పేరుతో ఎనిమిది రకాల సువాసనలు వచ్చే శానిటైజర్స్ తేలిగ్గా బ్యాగ్ లోనో జేబులోనో పెట్టేసుకోవచ్చు .ఈ నెలరోజులు కోవిద్ – 19 విస్తరణలో టచ్ లాండ్ కి ఊహించని గిరాకీ వచ్చింది .దేశ దేశాల నుంచి లక్షల కొద్దీ ఆర్డర్స్ ఉన్నాయి .ఇప్పుడు టచ్ లాండ్ వందల కోట్ల టర్నవర్ ఉన్నా కంపెనీ .