ఇష్రత్ బానో (38) రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన అంగన్వాడీ కార్యకర్త.ఏడేళ్లుగా ఇడ్గాకాచి అనే మురికివాడ లోని చిన్నారుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోంది.అంగన్వాడీ కేంద్రానికి రూ 2000 అద్దెను తానే చెల్లిస్తోంది.దాతల నుంచి విరాళాలు సేకరించి పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆ చిన్నారులకు తృణధాన్యాలు, బెల్లంతో చేసిన ఆహారం దుస్తులు,పుస్తకాలు ఇస్తోంది. ఆశా వర్కర్లతో కలిసి పనిచేస్తూ మహిళల కు ఆరోగ్యం కోసం కృషి చేస్తోంది.  ఈ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వ నోడల్‌ అంగన్వాడీ అధికారి డాక్టర్‌ కె.కె.పాథక్‌ నుంచి ప్రశంసలను, జాతీయ మహిళా కమిషన్‌ నుంచి అవార్డునూ అందుకుంది ఇష్రత్ బానో.అక్కడ వాళ్ళు ఆమెను అంగన్వాడీ బాజీ అంటారు ప్రేమతో.

Leave a comment