తాజాగా అమెరికా మొదటిసారి ప్రకటించిన అంతర్జాతీయ అవినీతి నిరోధక చాంపియన్స్ అవార్డ్ కు ఎంపికయ్యారు అంజలి భరద్వాజ్ ఢిల్లీలో పుట్టిన అంజలి లేడి శ్రీ రామ్ కాలేజ్ లో బి.ఏ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ. ఢిల్లీలో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేశారు ప్రభుత్వ చట్టాలు పౌర హక్కుల పై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు సామాజిక సేవ కార్యకర్త గా మారారు. రెండు దశాబ్దాలుగా ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం మేరకు ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్,పెన్షన్లు,ఆరోగ్యం,పారిశుద్ధ్యం  విద్య వంటి అంశాల్లో ప్రజల తరఫున చట్టపరంగా పోరాడి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు ప్రభుత్వం చట్టాలు ప్రజల దగ్గరకు చేర్చటం  ఆమె లక్ష్యం.

Leave a comment