Categories
నేషనల్ కమిషన్ ఫర్ ప్రోటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సుప్రీం కోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో దేశవ్యాప్తంగా 2874 చైల్డ్ కేర్ ఇన్ స్టిట్యూట్ లను తనిఖీ చేస్తే అందులో కేవలం 54 మాత్రమే చట్టబద్ధంగా నడుస్తున్నాయని అంది. బీహార్ లో ముజఫర్ లో ఇటీవల బాలల సంరక్షణలో జరిగిన లైంగిక అకృత్యాలపై ఆలోచన చెలరేగిన నేపథ్యంలో ఆ సంరక్షణాలయాల విషయంలో క్షుణంగా అధ్యయనం చేసి ఎన్.సి.పి.ఆర్ ఈ నివేదిక ఇచ్చింది. పిల్లల జీవితం ఎంతో ప్రమాదకరమైన అంచున ఉందో ఈ నివేదికలో స్పష్టంగా తేల్చారు.