నాకెరీర్ ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా మంచి పాత్రల గురించి బోలెడంత ఛాయిస్ ఉందను కొండి అయినా ఏదైనా మంచి సినిమా వచ్చి అందులో హీరోయిన్ పాత్ర నచ్చితే నాకీ అవకాశం వచ్చినట్లయితే ఎంత బావుండేది అనుకుంటూ ఉంటా అంటోంది పూజా హెగ్డే. సినిమ అంటే నాకెంతో ఇష్టం అంటే అన్ని సినిమాల్లోనూ నేనే చేయాలని కొరుకునేంత ఇష్టం. ఇంత స్వార్థం ఏమిటని అనిపిస్తునే ఉంటుంది దాని కోరుకోవటం మాత్రం మనసు అంటోంది నిజాయితీగా. ఆలా అని నాకేం ఈర్ష్య అయితే లేదు పాత్ర నచ్చితే వేంటనే ఫోన్ చేసి అభినందిస్తూ వుంటా నాకు ఎన్నో అవకాశాలు ఎన్నో పాత్రలు వస్తాయి. కానీ ఇప్పటికి మాత్రం ప్రతి సినిమా నేను చేస్తే బావుండన్న కోరిక మాత్రం మనసులో మెదులుతూ వుంటుంది అంటోంది పూజా హెగ్డే.