ట్రెండ్ మారుతోంది. కథలు మారతున్నాయి. మరీ హీరోయిన్స్ మాత్రం ఈ మార్పుని పసిగట్టారా? అనుపమా పరమేశ్వరన్ చక్కగా చుదువుకున్న అమ్మాయి. కెమెరా ముందు తను నటించటం పూర్తయ్యాక కేర వ్యాన్ లో ఎక్కి కూర్చోకుండా కెమెరా వెనుకల చేరుతుందట. ఆ విభాగానికి సాయం చేస్తూ ఉంటుందట. ఎందుకిలా అని అడిగితే సాంకేతికత ఎంత ఎక్కువగా తెలిస్తే నటనకు అంతమేలు జరుగుతుంది అని చెప్పుకొచ్చింది. ముందు నుంచి సినిమా కు సంబంధించిన అన్ని విషయాలపై నాకు ఆసక్తి ఉంది. నన్ను నేను తీర్చిదిద్దుకోవాలను కొంటాను . వ్యక్తిగతంగా నేను కాస్త సున్నితం కానీ కొత్తవిషయాలు నేర్చుకోవటంలో ఎంతైనా కష్టపడతాను అంటుంది అనుపమా పరమేశ్వరన్.

Leave a comment