చిన్న పిల్లలు సాధారణంగా అన్నం తినేందుకు తల్లుల్ని చాలా విసిగిస్తారు. కొన్ని ఇష్టం లేదంటారు. ఎంత బతిమిలాడినా తిననంటారు. అలాంటప్పుడే పిల్లల విషయంలో ఒక నిశ్చయానికి వచ్చేసి ఇక ఆ పదార్ధం పిల్లలకు పెట్టడం మానేస్తారు. అదే చాలా తప్పు అంటున్నారు. చైల్డ్ సైకాలజిస్టులు.  వాళ్ళకి  అన్ని రుచులు అందాలి. ఇంట్లో తినే ఆహారంలో చక్కటి చేరుస్తూ వుంటే వాళ్ళకు రుచి తెస్తుంది. కొన్ని వద్దంటే వాళ్ళకు నచ్చదని మీరు డిసైడ్ చేయకండి. పండ్లు, ఆకుకూరలు, గుడ్లు, పాలు అన్ని రకాలు ఇవ్వాలి. ఏదన్నా నచ్చదంటే దాన్ని ఇంకో రకంగా వాళ్ళకు నచ్చేలా చేసి తినిపించాలి. ఈ ప్రకృతిలో దొరికే ఏ వస్తువులకూ వాళ్ళని దూరం చేయకండి అని సలహా ఇస్తున్నారు.

Leave a comment