సెలవుల్లో తప్పనిసరిగా పిల్లలతో ప్రయాణం పెట్టుకుంటారు. సరిగా ప్లాన్ చేసుకుని ముందే లిస్ట్ ప్రకారం అన్ని సర్దుకుంటే పిల్లలతో ప్రయాణాలు చాలా సరదా ఇస్తాయి. టూర్ ప్లాన్ లో పిల్లలు ఎంజాయ్ చేసే ప్లే జోన్స్, ఫుడ్ జోన్స్ ముందుగానే వెతికి పెట్టుకోవాలి. చారిత్రక ప్రదేశాలు థీమ్ పార్క్ లకు వెళితే ముందే పిల్లలకు వాటి గురించి చెప్పి వాళ్ళు ఏమి చూడబోతున్నారో ప్రిపేర్ చేస్తే వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. పిల్లల కోసం కావలిసినన్ని స్నాక్స్ ముందే రెడీ చేసుకోవాలి. మంచి తిను బండారాలు , మంచి నీళ్ళు , ఫజిల్ బుక్స్ , వీడియో గేమ్స్ ఇవన్ని టైమ్ పాస్ కోసం రెడీ చేసుకోవాలి.

Leave a comment