పిల్లలు చాలామంది బిస్కెట్స్ ఇష్ట పడతారు . చిన్నతనం నుంచి ప్రత్యామ్నాయ చిరుతిండ్లు అలవాటు చేయకపోవటం వల్ల ,అలవాటుగా తెలిసిన బిస్కెట్లు తప్ప ఇంకేం తిననంటారు పిల్లలు . కానీ పండ్లు ,కూరగాయలు ఎదిగే పిల్లలకు చాలా అవసరం . అరటి పండు ,దానిమ్మ,బాదం ,పల్లీలు ,జొన్న,మొక్కజొన్నపేలాలు ,బఠానీలు ,శెనగలు వంటివి పిల్లలకు చిరుతిండ్లు గా అలవాటు చేయాలి . వాళ్ళకి ఖరీదైన బిస్కెట్లు ,బర్గర్ లు ఇచ్చే కంటే ఇవాళ్టి సహజమైన చిరుతిండ్ల లోనే ఎంతో ఆరోగ్యంగా  ఉంటారు. పిల్లలకు ఊహ వస్తున్న కొద్దీ మనం తినే ప్రతి ఆహార పదార్దాలను పరిచయం చేయాలి .

Leave a comment