ఒక ఎమోజీ ఒక అనంతమైన భాష. ఒక్క క్షణంలో మనసు ఎలా ఉందో చెప్పాలంటే ఒక ఒక్క అక్షరం కూడా రాయకుండా  జస్ట్ ఒక్క ఎమోజీ క్లిక్ మనిపిస్తే చాలు నవ్వు, దుఃఖం, బాధ, కోపం, ఎక్స్ ప్రషన్ కావాలన్నా  ఓ ఏమోజీ నే చూపిస్తుంది. గుండ్రంగా ఉన్న బాల్ పైన ఎన్నో రకాలున్నా  భావాలు స్మైలీ లుక్ ఎమోజీ లు  ఇప్పుడు ప్రతి వాళ్ళ జీవితంలో ఒక భాగం. ఇప్పుడు ఫేస్ బుక్ లో నిత్యం వాడే ఎమోజీ  లు ఎన్నో డిజైన్లతో ఫర్నిచర్ లు ,డోర్ కర్టెన్స్ ,దుప్పట్లు, బ్యాగ్ లు ,చెప్పులు, గొడుగులు ఇలా సమస్త వస్తువుల పైకి వచ్చేసాయి ఆన్ లైన్ లో నిరంతరం అక్షరాలకు బదులుగా  ఎస్సెమ్మెస్  చేయగలిగే ఈ ఎమోజీ లు నిత్య జీవితంలో మనం వాడుకునే అన్ని వస్తువుల పైకి ఎక్కి కనువిందు చేస్తున్నాయి.టీ కప్పు పైన పాపాయి  గౌన్ పైన ఈ నవ్వు మొహం ఎమోజీ లే .

Leave a comment