సాధారణంగా బయటకు వెళుతూ ఉంటే బ్యాగ్ లో వెట్ వైప్స్ శ్రద్ధగా  పట్టుకుపోతాం. ఈ ముఖం తుడుచుకుని తడి టిస్యూలు మంచివే కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోమంటురు ఎక్స్ పెర్ట్స్. సాయంత్రం వరకు ఎండ లో బయట గడప వలసి వస్తే మధ్య మధ్యలో ఈ టిస్యూ పేపర్ తో ముఖం తుడుస్తాం  కదా. కానీ వీటితో గట్టిగ అదిమిపట్టి తుడుచుకోకూడదు . సున్నితంగా ముఖం అడుగు నుంచి పైకి తుడుచుకోవాలి. ముఖం నిండా మొటిమలు ఉంటె వాడకపోవటం  మంచిదే. కళ్ళకు ఇన్ఫెక్షన్ ఉంటే వీటిని అస్సలు వాడకూడదు. కళ్ళకు మరీ దగ్గరగా కాటుక పెట్టే చోట వీటిని వాడకుండా ఉండటమే మంచిది . ముఖానికి మేకప్ ఉంటే పొడి టిస్యూనే వాడాలి. ఫౌండేషన్ ఇతర క్రీములు పోతాయి. అలంకరణ తీసివేసాక తడి టిస్యూ వాడాలి . ఈ టిస్యూ బాక్స్ ల విషయంలో శ్రద్ధగా  ఉండాలి. ప్రతీసారీ ప్యాకెట్ సీల్ సరిగ్గా మూయాలి. లేకపోతే పొడిగా అయిపోతాయి. అలా మాటిమాటికీ చేయలేకపోతే జిమ్ బ్యాగ్ లో ఉంచటం మంచిది. టిస్యూలతో మొహం శుభ్రం చేసినా ఇంటికి రాగానే చన్నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

Leave a comment