ఎప్పటికీ మారిపోని ఫ్యాషన్ ఏదైనా ఉందీ అంటే కలంకారీనే రామాయణ, భారత, భాగవత ఇతిహాసాలు, ప్రకృతి అందాలు, వర్ణాలతో ఇవి వేడుకలకు కుడా ప్రత్యేకంగా కనిపిస్తాయి. సాధారనంగా కలంకారీలో మల్ మల్ కాటన్, మంగళ గిరీ, గుంటూరు చీరలు చాలా బావుంటాయి. చీరకు అదే డిజైన్ బ్లవుజు లేదా సాదా బ్లవుజు, చేతులకు కలంకారీ డిజైన్ బ్లవుజ్ పీస్లు వస్తున్నాయి. సాదా చీరలైతే చక్కని కలంకారీ దిజన్, జాకెట్ పూర్తిగా అదే బ్లవుజు ఎప్పటికీ చెదరని అందం. స్కర్టులు, కుర్తీలు కుడా కలంకారీ పట్టు దెసిగ్న్స్ లో పార్టీ వేర్ గా బావుంటాయి. ఆప్లిక్ వర్క్తో నైలాన్ దారం తో కలంకారీ డిజైన్ తో జరీ పని తనం తో వున్న కుర్తీలు ప్రతి సందర్భానికి ప్రేత్యేకం. చీరలు, దుస్తులేకాదు పర్సులు, బ్యాగులు, చెప్పులు, రంగుల గాజులకు కుడా కలంకారీ పనితనం తోడవ్వుతుంది.

Leave a comment