ప్రాజెక్ట్, ప్లాన్, వ్యాపారం పట్ల ఇష్టం వున్న స్టార్టప్స్ కు ఎందఱో పెట్టుబడి పెట్టేందుకు వస్తున్నారు. సెలబ్రెటీలు సినిమా స్టార్లు ఇందుకు మినహాయింపు కాలేదు. తమ సంపాదనలో  కొంత స్టార్టప్స్ కు పెట్టుబడి పెడుతున్నారు. తామే బ్రాండ్ అంబాసిడర్స్ గా సాయం చేస్తున్నారు కుడా. మాధురీ దీక్షిత్  కాలిఫోర్నియా కు చెందిన గోకి అనే కామర్స్ సైట్ లో పార్టనర్ గా వుంది. ఈ సైట్ లో ఫిట్నెస్ గాడ్జెట్స్ అమ్ముతారు. పిల్లల ఉత్పత్తులు అందించే ఈ కామర్స్ సంస్ధ బేబీ ఓయ్ ఇందులో కరిష్మా మెయిన్ పార్టనర్. బేబీ ఓయ్ లో 26 శాతం వాటా ఆమెదే. వీళ్ళలాగే సచిన్ టెండుల్కర్, అనిల్ కపూర్, అజయ్ దేవఘన్, అమితాబ్ బచ్చన్ లు కుడా స్టార్టప్స్ కు పెట్టుబడి పెట్టినవారే.

Leave a comment