Categories
ఇంటిని శుభ్రం చేయటంతో ఇప్పుడు వెనిగర్ ను వాడుతారు కానీ వాడే తీరులో కొంత జాగ్రత్త పాటించాలి. ఇంట్లో గ్రానైట్ ,పాలరాతి నేలలుంటే దాన్ని తొడిచేందుకు వెనిగర్ వాడకూడదు. వాటికుండే సహజమైన మెరుపు ఇది తగ్గిస్తుంది. వాటి కోసం గాఢత తక్కువున్న క్లీనర్లు వాడవలసిందే. ఒక వేళ వంట గదిలో గుడ్డు జారి కిందపడితే దాన్ని వెనిగర్ తో తుడవటం కష్టమైపోతుంది. చెక్క వస్తువులు తుడవాలంటే కాస్త నీళ్ళు కలిపి వాడాలి లేకపోతే నేరుగా వెనిగర్ వాడితే చెక్క మీద మెరుపు పోతుంది. దుస్తులపైన పడిన సిరా,రక్తం మరకలు వెనిగర్ లో పోవు. వాటికి సైయిన్ మూవర్లూ ,డిటర్జెంట్ లు కావసిందే.