గోళ్ళ పైన రంగును తుడిచేయడమే కాదు, ఈ రిమూవర్ తో చాలా ప్రయోజనాలున్నాయి. పిల్లల యూనిఫాం పైన సిరా మరకలు పడితే వాటిని తొలగించేందుకు దూది పైన రిమూవర్ ని వేసి తుడిచేస్తే పోతాయి. పింగాణి కప్పుల పైన టీ, కాఫీ మరకలు పడితే అలాంటి మరకలు పోవాలంటే గిన్నెలు తోమే స్పాంజి పైన నెయిల్ పాలిష్ రిమూవర్ రెండు చుక్కలు వేసి తోమితే పోతాయి. పాత బూట్లు కొత్త వాటిలా మెరవాలంటే వాటి పైన ఈ రిమూవర్ చుక్కలు వేసి తుడిస్తే పోతాయి. అలాగే చాలా మందికి బంగారు నగలు తప్పా ఇతర లోహాల నగలు పడవు. అలర్జీలు వస్తాయి. అలాంటప్పుడు ఈ నగలని ధరించే ముందర వాటి అడుగుభాగంలో ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ రాస్తే అలర్జీలు రావు.
Categories
WoW

అన్నింటినీ తుడిచేస్తుంది.

Leave a comment