చాలా కాలం తర్వాత  గులేబఘవాలి  సినిమాలు హాన్సిక ప్రభుదేవా సరసన నటించి మంచి మార్కులు సంపాదించింది. ప్రభుదేవాతో తన డాన్స్ సంగతులు చెపుతూ ఆయన రబ్బరులాంటి వ్యక్తి ఎలా కావాలంటే అలా సాగుతాడు . ఆయనతో కలిసి చేసిన పాటలన్ని గంటలకొద్దీ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే డాన్స్ చేశాను అంత శ్రమ పడ్డాక అందరు బావుందన్నారు అంటుంది హాన్సిక. డైలాగ్స్ ఎంత పెద్దవి ఉన్న ఉలాగోలా బట్టిపట్టి చెప్పయవచ్చు, ప్రభుదేవాతో డాన్స్ వ్యవహారం మాత్రం అంత తేలిక కాదు.  డైలాగ్స్ కంటే డాన్స్ విసయంలో చాలా కష్టపడ్డాను . అన్నీ భాషల కన్నా తమిళం కొంచెం ఎక్కువచ్చు .కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేశాను కదా.  తెలుగు, కన్నడ, మలయాళం అర్థం అవుతాయిగానీ మాట్లాడలేను. నేను ఎప్పటికీ నటిగానే ఉండేందుకు ఇష్టపడతాను .సినిమా కు సంబంధించిన ఏ రంగంలోనూ ,ఏ బిజినెస్ లోనూ, నిర్మాణ రంగంలోకి రావటం కానీ ఇప్పటికి అయితే వచ్చే ఆలోచన లేదు అంటుంది హాన్సిక.

Leave a comment