Categories
Soyagam

అంత ఎండకి ఈ మాత్రం జాగ్రత్త కావాలి

మండే ఎండల్లో చర్మ సంరక్షణ చాలా అత్యవసరం ఇందుకు గానూ కొంత ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకోవాలి. ఎంత తొందర పని వున్నా. ముందుగా సన్ స్క్రీన్ లోషన్ అప్లయ్ చేసాకనే బయట కాలు పెట్టాలి. ఎండ తీవ్రతకు చర్మం కందిపొతే ఆ ప్రదేశంలో అలా వేరే లోషన్ అప్లయ్ చేయాలి. వేసవిలో ఒంటికి మాయిశ్చురైజర్ రాసుకోవాలి. పొడి చర్మం అయినా ఆయిలీ స్కిన్ అయినా మాయిశ్చురైజర్ అవసరమే. ఎండలో తిరిగితే చర్మం కమిలినట్లు అవుతుంది. అప్పుడు, సెనగ పిండి, పెరుగు ప్యాక్ లాగా వేసుకోవాలి. చర్మం అస్సలు రంగు వచ్చి నిగారింపుతో వుంటుంది. రెండు చెంచాల తేనె ఒక చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి తర్వాత గోరు వెచ్చని నిళ్ళ తో శుబ్రం చేయాలి. బయటకు వెళుతూ తప్పనిసరిగా వెంట మంచినీళ్ళ బాటిల్ తీసుకు పోవాలి. శరీరం డీహైడ్రేషన్ కు గురవ్వకుండా ఉండాలంటే నీళ్ళు ఎక్కువ తాగాలి. తల, మొహం కవర్ అయ్యేలా హ్యాట్ పెట్టుకోవడం లేదా గొడుగు వాడటం తప్పనిసరి.

Leave a comment