రోజుకు పది వేల అడుగులు నడిస్తే ఆరోగ్యం అని పరిశోధనలు ఏ నాడో చెప్పాయి. ఇప్పటికి ఎందరో ఆచరణ లో పెట్టారు కూడా. కానీ కొత్త పరిశోధనలు ఇన్ని వేల అడుగుల నడక వల్ల కాలోరిలు కర్చుఅవ్వుతాయి కానీ ప్రయోజనం ఇకేముంటుంది అంటున్నారు. వుబకయం వుంటే కాస్త తగ్గుతారు, బరువు పెరగ కుండా వుంటారు. కానీ మరి సాధారణ బరువు ఆరోగ్యం వున్నవాళ్ళ కి ఇంత కష్టమైన ఎక్స్ సైజులు వద్దంటున్నారు. రెండు నుంచి మూడు వేల అడుగులు చాలు అది సాధారణమైన మన్యుషులకు కరెక్ట్ వ్యాయామం. అంటే కానీ నడక తో అంతంత సేపు శరీరాన్ని కష్ట పెడితే కిళ్ళ నొప్పులు తప్పవంతున్నారు. 50 ఏళ్ళు దాటితే, ఇంక ఆ వయస్సులో కిళ్ళ నొప్పుల తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. తీసుకునే ఆహారం చాలా తక్కువైపోతుంది. ఆరోగ్య స్పృహ వల్ల ఒక్క పూటే అన్నం, చపాతీలు, ఇంకా కొన్ని పళ్ళు తిని సారి పెట్టుకుంటారు. లేదా వృద్దాప్య దశ లో అంత కంటే ఎక్కువ అరగదు కనుక ఆ తినే ఆహారానికి సరిపడా నడకే ఎంచుకోమంటున్నారు. ఇంకా ఎక్కువ నడవాలంటే వైద్యుల సలహా పైన మాత్రమే అంటున్నారు.

Leave a comment