Categories
ఎంత సాధన చేస్తే అంత మంచిది అనుకొంటాము కదా. కానీ అలాగా ప్రాక్టీస్ చేసిన ఫర్ ఫెక్షన్ సంగతి అలావుంచి ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్ . ప్రాక్టీస్ అన్నాక ఒక సమాచారం అనుకొంటే దాన్ని మెదడు స్వీకరించేందుకు దాన్ని సంఘటిత పరుచుకొనేందుకు కొంత సమయం పడుతోంది. ఇందుకు ట్రైనింగ్ స్టేషన్లు నడుమ బ్రేక్ తీసుకోవలిసిన అవసరం ఉంటుంది. దీనికి నిద్రించే సమయం తోడుకావాలి. ఏ వీణ ,లేదా వయోలిన్ నేర్చు కోవాలన్న దేన్నయినా మెమొరీ లో బందించాలన్న నిద్ర పోవాలి ఈ విశ్రాంతిలో మెదడు ఇచ్చే సమాచారాన్ని ఫీడ్ చేసుకొంటుంది. ఉదాహరణకు నేర్చుకోవాలనుకొన్న పాటను మైండ్ రికార్డ్ చేసుకోవాలంటే కాస్త సమయం ఇస్తూ ప్రాక్టీస్ చేయాలన్నమాట.