మనం ఇష్టపడే రంగులు వేసుకునే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయని చెపుతుంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. తెలుపు రంగును స్వచ్ఛతకు గుర్తుగా భావిస్తాం. ఈ రంగుని ఇష్టపడే వాళ్ళు స్వచంగా నిర్మలమైన మనసు తో ఉంటారని ప్రతి విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తారని అంటారు. నలుపు రంగు ఇష్టపడేవాళ్లు బలమైన వ్యక్తిత్వం గలవాళ్ళు. ఇంకొకరి ఆధిపత్యాన్ని సహించరు. ఎరుపు ఇష్టపడేవాళ్ళకు స్వాభిమానం ఎక్కువ. శక్తి సామర్ధ్యాలు ఎక్కువే. కోపిష్టులు కూడా. నీలి రంగు ను ప్రేమించే వాళ్ళు ప్రాక్టికల్ గా వుంటారు. నిలకడగా నిజాయితీగా ఉంటారు. బ్రౌన్ కలర్ ఇష్టం వున్నవాళ్లు నిరాడంబరంగా ప్రశాంత జీవితానికి మొగ్గు చూపిస్తారట. ఇక పసుపు రంగైతే సుభానికీ సంతోషానికీ  ప్రతీక. ఈ రంగు ఇష్టపడేవాళ్లు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. కష్టాలు కనీళ్ళు అస్సలు ఇష్టపడరు. ఇది ఆకట్టుకునే రంగు కూడా. ఆరెంజ్ ఇష్టం ఉన్న వాళ్ళు మాటకారులు. పొదుపుగా జీవితం సుఖమయంగా గడపాలని కోరుకుంటారు. గులాబీ రంగును అమ్మాయిలే ఇష్టపడతారు. అందంగా చిలిపిగా మృదుస్వభావంతో ఉంటారు. పనిలో ఖచ్చితమైన తత్వాన్ని కోరుకుంటారు.

Leave a comment